We invite everyone to join this daily live Sai Namam session from 7:30pm to 8pm IST. This is for Sai devotees around the world to connect with each other and to our common source of strength and love — Sri Sai Baba & Sri Babuji.
- Saipatham Team.
అందరూ “సాయిబాబా” అని పిలిచారు, శ్రీసాయినాథుడు పలికారు. “సాయిబాబా, సాయిబాబా అని గుండెలోతుల్లో నుండి పిలవండి” అని పూజ్యగురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ ఉవాచ. “సాయిపథం”లో భజనంటే రాగయుక్తమైన బృందగానం కాదు. శ్రీసాయిని త్రికరణాలతో పిలవడం. భక్తుల హృదయాంతరాళాల నుండి వెలువడే “సాయిబాబా, సాయిబాబా” అన్న పిలుపే సాయిభక్తులకు భజన, జపం, సంకీర్తన, సాధన.
శ్రీసాయిలో మనం లయించిపోవడానికి గల అత్యుత్తమమైన మార్గాలలో ఒకానొకటి సాయినామస్మరణ. అందుకని ప్రపంచవ్యాప్తంగా గురుబంధువులందరూ ఒకే సమయంలో ఒకే వేదిక ద్వారా సాయిస్మరణలో భాగం కావడానికి యూ-ట్యూబ్ మాధ్యమంగా సాయిబాబా నామసంకీర్తనను ఏర్పాటుచేసుకోవడం జరిగింది. ఇండియా నుంచే కాక యూరప్, జపాన్, అమెరికా ఇలా ఎన్నో దేశాలనుండి సాయిభక్తులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
అసంఖ్యాక సాయిభక్తులను సాయినామ సంకీర్తనామృతంలో ఓలలాడించే ఈ పవిత్ర వేదికను సాయిపథగాములైన గురుబంధువులే తమ సాధనలో భాగంగా ఎంతో భక్తి, ప్రేమ, శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా రూపకల్పన చేసి నిర్వహించుకుంటున్నారు. “సాయిబాబా” అన్న మహామంత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అపరిచితులైన సాయిభక్తులను ‘సాయిప్రేమ’ అనే సూత్రంతో దగ్గరచేసి, సాయిబంధంతో పెనవేసి, అందరికీ తాము ఒకే వసుధైక సాయికుటుంబం అన్న స్పృహను ఈ వేదిక కలిగిస్తోంది.
ఈ సాయినామ సంకీర్తన కార్యక్రమం గురువారం తప్ప భారతకాలమానం ప్రకారం ప్రతిరోజూ రాత్రి 7:30 నుండి 08:00 గంటలవరకు జరుగుతుంది. ఎనిమిది గంటలకు శిరిడీలోని సాయిపథం సత్సంగహాలులో బాబాకు ఇచ్చే ఆరతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రతి శనివారం ఆరతికి ముందు, పూజ్యశ్రీబాబూజీ సత్సంగభాషణలు ఐదు, పదినిమిషాలపాటు వినే అవకాశం కూడా ఉంటుంది. సమయానుకూలతను బట్టి సాయిపథంలో వివిధ సందర్భాలలో జరిగిన సాయినామ సంకీర్తనలను కూడా ఆడియో రూపంలో పంచుకోవడం జరుగుతుంది.
సాయిభక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సద్గురు కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాము.
సాయిపథం టీం
#saipathamnamam#saibabanamam#saibababhajan
#saibabanamamlive#saibababhajanlive#dailysainanam
#dailysaibabanamam#saibabachanting

- Категория
- Макраме
Комментариев нет.